Thursday, April 25, 2024

వైల్డ్ డాగ్ క్లోజింగ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా ?

అక్కినేని నాగార్జున హీరోగా అహిషోర్ సోలమన్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వైల్డ్ డాగ్. ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం విజయం సాధించలేకపోయింది. ఈ సినిమాలో ఏసిపి విజయ్ వర్మ పాత్రలో అక్కినేని నాగార్జున నటించారు. ఇక వరల్డ్ వైడ్ గా వైల్డ్ డాగ్ 3.44 కోట్ల షేర్ ను వసూలు చేసింది. అలాగే థియేట్రికల్ రైట్స్ తొమ్మిది కోట్లు పలికింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

కాగా ఈ సినిమాకు సంబంధించిన క్లోజింగ్ కలెక్షన్లు చూస్తే నైజాంలో 1.2 కోట్లు, సీడెడ్‌లో 37 లక్షలు, ఉత్తరాంధ్రలో 45 లక్షలు , ఈస్ట్‌లో 23 లక్షలు, వెస్ట్‌లో 16 లక్షలు, గుంటూరులో 25 లక్షలు, కృష్ణాలో 28 లక్షలు, నెల్లూరులో 10 లక్షల తో రెండు రాష్ట్రాల్లో 3.04 కోట్లు షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్ లో 40 లక్షలు కలిపి మొత్తం వరల్డ్ వైడ్ గా 3.44 కోట్ల షేర్ వసూలు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement