Friday, April 26, 2024

త్రివిక్రమ్ సినిమాకు మహేష్ బాబు రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

టాలీవుడ్ స్టార్ హీరోలు రెమ్యూనరేషన్ విషయంలో అస్సలు తగ్గటం లేదు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు రెమ్యూనరేషన్ విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉంటారు. ఓ సినిమా చేయాలంటే మొదట అడ్వాన్స్ తీసుకోవడంతో పాటు…రైట్స్, లాభాల్లో వాటాలను కూడా తీసుకుంటూ ఉంటాడు. ఈ లెక్కన చూసుకుంటే మహేష్ కు 1 సినిమాకు 50 కోట్ల వరకు వచ్చే అవకాశం ఉంది. నిజానికి మహేష్ సినిమాలకు సంబంధించి ఫైనాన్షియల్ డీలింగ్స్ అన్ని బాంబే కి చెందిన ఓ ఏజెన్సీ చూస్తూ ఉండేది.కాని కరోనా సెకండ్ నేపథ్యంలో ఆ ఏజెన్సీ తో డీల్ కష్టతరంగా మారింది. అందుకే మహేష్ డైరెక్ట్ గా పూర్తిస్థాయిలో రెమ్యునరేషన్ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాడట.

ఇక తాజాగా త్రివిక్రమ్ తో మహేష్ బాబు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకు మహేష్ రైట్స్, వాటాలు వంటివి కాకుండా డైరెక్ట్ గా రెమ్యూనరేషన్ కి ఒప్పందం చేసుకున్నాడట. మొత్తం 60 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ను మహేష్ కు నిర్మాతలు ఇవ్వనున్నారట. ఇదే విషయమై ఫిల్మ్ నగర్ గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో వారికే తెలియాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement