Saturday, June 19, 2021

బాలయ్య బర్త్ డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో తెలుసా ?

నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు అభిమానులు విషెస్ తెలుపుతున్న సంగతి తెలిసిందే. కాగా కరోనా కారణంగా ఎవరు కూడా తనని కలవడానికి రావద్దని నందమూరి బాలకృష్ణ ముందుగానే ఓ ప్రకటనను విడుదల చేశారు. అయితే బాలయ్య తన పుట్టిన రోజు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడు అనేది ఇప్పటి వరకు తెలియరాలేదు. కానీ తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

బాలకృష్ణ తన పుట్టిన రోజు వేడుకలను తాను స్థాపించిన బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రిలో ఆసుపత్రి సిబ్బంది తో చిన్నారులతో ఆహ్లాదకర వాతావరణంలో పుట్టిన రోజు వేడుకలను జరుపుకున్నారు. అంతేకాకుండా నందమూరి తారక రామారావు బసవతారకం గారి ఆశీస్సులతో తన జన్మదిన వేడుకలు జరుపుకున్నామని వేడుకలకు సంబంధించిన ఫోటోలు పోస్ట్ చేశారు.

బాలయ్య బర్త్ డే సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో తెలుసా ?
Advertisement

తాజా వార్తలు

Prabha News