Thursday, March 28, 2024

సీటిమార్ సాంగ్ కు డాక్టర్స్ డాన్స్… వావ్ అంటున్న దిశా పటాని

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఏ చిన్న విషయమైనా ఇట్టే వైరల్ అవుతూ వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభంలో కొన్ని ఫన్నీ వీడియోస్, ఫోటోలు నవ్వును తెప్పిస్తూ ఉన్నాయి. మనసుకు కొంత ప్రశాంతతను కలిగిస్తూ ఉన్నాయి. అయితే తాజాగా హీరోయిన్ దిశా పటాని అలాంటి వీడియోను షేర్ చేసింది. ఆ వీడియోలో సిటిమార్ అంటూ డాక్టర్స్ చిందులు వేస్తూ కనిపించారు. దిశా పటాని లేటెస్ట్ సినిమా రాధే లో అల్లు అర్జున్ సీటీ మార్ పాటను రీమేక్ చేశారు.

ఈ పాట బాగా పాపులర్ అయింది. ఆ పాటకే ఇప్పుడు డాక్టర్ అదిరిపోయే స్టెప్పులు వేశారు. డాక్టర్ చేతులు మండోలిన్ పట్టుకొని అద్భుతంగా వాయించాడు. అయితే ఈ స్టెప్స్ దిశాపటాని ని ఎంతో ఆకట్టుకున్నాయి. అందుకే ఇంస్టాగ్రామ్ లో ఆమె వావ్ అంటూ షేర్ చేసింది. డాక్టర్ ఎనర్జిటిక్ పర్ఫామెన్స్ కు ఫిదా అయింది దిశా పటాని.

Advertisement

తాజా వార్తలు

Advertisement