Friday, April 19, 2024

కార్తికేయ సరసన డర్టీ హరి హీరోయిన్ !

ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు కార్తికేయ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టింది.ఇక ఇటీవలే చావు కబురు చల్లగా సినిమాతో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తికేయ. ఈ సినిమా కూడా ఫర్వాలేదనిపించింది. కాగా ఇప్పుడు కార్తికేయ తమిళ్ స్టార్ హీరో అజిత్ హీరోగా తెరకెక్కుతున్న వాలిమై చిత్రంలో విలన్ గా నటిస్తున్నాడు.

అయితే ఇదిలా ఉండగా తాజాగా యు.వి క్రియేషన్స్ బ్యానర్ తో కార్తికేయ ఓ సినిమాను చేయబోతున్నాడు. అయితే ఇందులో చి ల సౌ సేమ్ రుహాని శర్మ ను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. రుహానీ శర్మ గతంలో హిట్, డర్టీ హరి సినిమాల్లో నటించిన సంగతి తెల్సిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement