Saturday, April 20, 2024

వకీల్ సాబ్ ట్రైలర్ పై ట్రోల్స్… సమాధానం ఇచ్చిన డైరెక్టర్

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక నెటిజన్లు రకరకాల ట్రోల్స్, మీమ్స్ చెయ్యటం మొదలుపెట్టారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీపై ఈ ట్రోల్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాగా ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది అంటే… దాని మేకింగ్ స్టైల్ చూసి వేరే డైరెక్టర్ మేకింగ్ స్టైల్ తో పోలుస్తూ ఉంటారు. తాజాగా వచ్చిన వకీల్ సాబ్ ట్రైలర్ ని చూసిన నెటిజన్లు కూడా మేకింగ్ స్టైల్ త్రివిక్రమ్ లానే ఉందంటూ కామెంట్స్ చేశారు. అయితే దీనిపై వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ స్పందించారు.

నన్ను ఈ సినిమా చేయడానికి ఆన్ బోర్డు చేసింది త్రివిక్రమ్ గారు. ఆయన అలా వైకుంఠపురంలో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కారణంగా స్క్రిప్టుపై వర్క్ చేయలేకపోయారు. అప్పుడు నన్ను పిలిచి వకీల్ సాబ్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పారు. నిజానికి నేను త్రివిక్రమ్ గారికి పెద్ద అభిమానిని. ఆయన వకీల్ సాబ్ స్క్రిప్ట్ మీద వర్క్ చేస్తే చాలా బాగుండేది. త్వరలోనే త్రివిక్రమ్ గారి స్క్రిప్ట్ ను డైరెక్ట్ చేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నాను అంటూ… వేణు శ్రీరామ్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఏప్రిల్ 9న రిలీజ్ కాబోతున్న వకీల్ సాబ్ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రైలర్ రికార్డ్స్ సృష్టిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement