Thursday, April 18, 2024

రామ్ లింగుస్వామి సెట్ లో డైరెక్టర్ శంకర్

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రామ్ కెరీర్లో 19వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే నదియా కీలక పాత్ర పోషిస్తోంది. ఈ నేపథ్యంలోనే నదియ ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. కాగా బుధవారం ఈ సినిమా షూటింగ్ స్పాట్ కి సంచలన దర్శకుడు శంకర్ వెళ్లారు. ఇదే విషయాన్ని చెబుతూ నిర్మాణసంస్థ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ ట్వీట్ చేసింది.

సెట్ కి వచ్చిన శంకర్ హీరో రామ్, దర్శకుడు లింగుస్వామి, నదియా ఇలా యూనిట్ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. ఇక ఇదే విషయాన్ని చెబుతూ శంకర్ కి కృతజ్ఞతలు తెలిపింది నిర్మాణసంస్థ. శంకర్ విషయానికి వస్తే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement