Saturday, April 20, 2024

సీటీమార్ రిలీజ్ డేట్ పై సంపత్ నంది ట్వీట్

సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ తమన్నా జంటగా ప్రజల ముందుకు రాబోతున్న చిత్రం సీటిమార్. కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం రిలీజ్ డేట్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. నిజానికి ఏప్రిల్ 2న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రయత్నించారు. కానీ అదే రోజు నాగార్జున వైల్డ్ డాగ్ కార్తీ సుల్తాన్ విడుదల కావడంతో ఈ సినిమాను వాయిదా వేశారు.

అయితే అప్పటి నుంచి కూడా సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ అప్డేట్ ను విడుదల చేశారు. తన కూతురు ఫోటోను పోస్ట్ చేస్తూ.. సిటీ మార్ సినిమా రిలీజ్ ఎప్పుడు నాన్నా ? ఇది ఒక ఆమె ఒక్క దాని ఎక్స్ ప్రెషన్ మాత్రమే కాదు. ప్రతి ఒక్క సీటిమార్ అభిమాని ప్రశ్న అని మాకు తెలుసు. కరోనా సెకండ్ వేవ్ కారణంగా మేము సినిమాని విడుదల తేదీ పై వర్క్ చేస్తున్నాం. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తాం. మీ ప్రేమకు సపోర్ట్ కు అర్థం చేసుకున్నందుకు థాంక్స్ అంటూ ట్వీట్ చేశారు సంపత్ నంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement