Saturday, April 20, 2024

దృశ్యం దర్శకుడికి రాజమౌళి వాట్సాప్ మెసేజ్…

దృశ్యం దృశ్యం 2 చిత్రాలతో మంచి సక్సెస్ అందుకున్న దర్శకుడు జీతూ జోసెఫ్. కాగా దర్శక ధీరుడు రాజమౌళి జీతు జోసెఫ్ పై ప్రశంసల జల్లు కురిపించారు. హాయ్ జీతూ నేను దర్శకుడు రాజమౌళిని. కొన్ని రోజుల క్రితం దృశ్యం2 సినిమా చూశాను. సినిమా చూసిన తర్వాత ఆలోచనలు అన్ని దాని చుట్టూనే తిరిగాయి. వెంటనే మళ్ళీ ఒకసారి మలయాళ దృశ్యం చూశా.

దర్శకత్వం స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, యాక్టింగ్ ప్రతి విభాగం అద్భుతంగా ఉంది.ముఖ్యంగా రచనా విధానం చాలా గొప్పగా ఉంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన కథ ఇది. దృశ్యం ఒక మాస్టర్ పీస్. అదే ఉత్కంఠతో దృశ్యం 2 తీసుకురావడం గొప్ప విషయం. మీ నుంచి మరికొన్ని మాస్టర్ పీస్ చిత్రాలు రావాలని కోరుకుంటున్నాను… అంటూ రాజమౌళి వాట్సాప్ ద్వారా మెసేజ్ చేశారు. దీనిని ఇంస్టాగ్రామ్ వేదికగా దర్శకుడు జీతూ అభిమానులతో షేర్ చేసుకుని రాజమౌళికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement