Thursday, April 25, 2024

‘సలార్’ లో ఐటమ్ గర్ల్ ఎవరో తెలుసా ?

కేజిఎఫ్ సినిమాతో స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు ప్రశాంత్ నీల్. ప్రస్తుతం కేజిఎఫ్ సినిమాకు సీక్వెల్ గా చాప్టర్-2 తెరకెక్కిస్తున్నాడు. అలాగే యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా సలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి.

ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తో ప్రశాంత్ నీల్ ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారట. ఆ ఐటమ్ గర్ల్ ఎవరో కాదట….కేజిఎఫ్ సినిమా హీరోయిన్ శ్రీనిధి శెట్టి. అయితే ఈ విషయంపై ఎక్కడా క్లారిటీ మాత్రం రాలేదు. ఊహాగానాలు మాత్రమే బయటకు వచ్చాయి. హోంబలే నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు కేజిఎఫ్ టెక్నీషియన్స్ నే ఎక్కువగా తీసుకున్నారు. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement