Friday, April 26, 2024

రవితేజ టైటిల్ పై ఆసక్తి రేపేలా డైరెక్టర్ పోస్ట్ !!

మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత శరత్ మండవ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. కెరీర్ లో 68వ చిత్రంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా షూటింగ్ జూలై 1 నుంచి ప్రారంభం కాబోతోంది. కాగా ఈ సినిమా విషయంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ సినిమాపై హైప్ ని కూడా ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటున్నాడు.

తాజాగా ఈ సినిమా కు సంబంధించిన టైటిల్ పై లీడర్ ఆఫ్ ది ప్యాక్ అనే టాగ్ తో ఓ పోస్ట్ చేశాడు శరత్. ఇది రవితేజ అభిమానుల్లో కూడా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ సినిమాకు లీడర్ అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తారా అనే అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. మరి ఆ క్లారిటీ రావాలంటే జూలై 1 వరకు వేచి చూడాల్సిందే.

బావమరిది కోసం ఎన్టీఆర్ ప్రత్యేక శ్రద్ధ ?

https://twitter.com/directorsarat/status/1409730509047943168?s=19
Advertisement

తాజా వార్తలు

Advertisement