Thursday, March 28, 2024

డైరెక్టర్ పాండిరాజ్ బర్త్ డే స్పెషల్….సూర్య కొత్త పోస్టర్ రిలీజ్

ఆకాశం నీ హద్దురా సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు తమిళ స్టార్ సూర్య. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలు లైన్ లో పెడుతున్నాడు సూర్య. అందులో పాండిరాజ్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికి ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కాగా ఈ రోజు దర్శకుడు పాండిరాజ్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ మరో లుక్ రిలీజ్ చేసింది.

అయితే మొదట రిలీజ్ చేసిన పోస్టర్ లో తూఫాకి పట్టుకొని సూర్య కనిపించగా…. ఇప్పుడు కత్తి పట్టుకుని కనిపించారు. అంతేకాకుండా పాండిరాజ్ మరికొన్ని విషయాలను కూడా ప్రకటించారు. ఇప్పటికి 35 శాతం షూటింగ్ కంప్లీట్ అయిందని లాక్ డౌన్ అనంతరం షూటింగ్ రీస్టార్ట్ చేయనున్నామని జూలై నెలలో టైటిల్ ప్రకటన ఉంటుందని… టైటిల్ మాత్రం చాలా మాస్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement