Tuesday, April 16, 2024

100 సినిమాల దర్శకుడు…మొదటి సారి స్క్రీన్ పై!!

దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీకాంత్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈచిత్రం పెళ్లిసందడి. ఈ సినిమా శ్రీకాంత్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం పెళ్లిసందD సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా నటిస్తున్నాడు. పెళ్లి సందడి సినిమాలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కూడా నటిస్తున్నారు. విశేషం ఏంటంటే ఆయన మహేష్ బాబు, అల్లు అర్జున్, వెంకటేష్, తాప్సీ, కుష్బూ ఎంతో మందిని ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

వందకుపైగా సినిమాలు చేశారు. కానీ ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ ఆయన నటించలేదు. కానీ మొదటిసారి ఈ చిత్రంలో వశిష్ఠ పాత్రలో నటిస్తున్నారు. అందుకు సంబంధించిన ప్రోమో ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాఘవేంద్రరావు శిష్యురాలు గౌరీ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement