Friday, April 19, 2024

మారుతీ డైరెక్ష‌న్ లో ప్ర‌భాస్ – గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేనా

ఇప్ప‌టికే ప‌లు భారీ ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. కాగా మ‌రో ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌నున్నార‌ట ప్ర‌భాస్. ద‌ర్శ‌కుడు మారుతి డైరెక్ష‌న్ లో ప్ర‌భాస్ న‌టించ‌నున్నాడ‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. డీవీవీ దానయ్య నిర్మాణంలో ప్రభాస్ ఒక సినిమా చేయవలసి ఉంది. అయితే ఇటీవల డీవీవీని కలిసిన మారుతి, తాను ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసిన కథను వినిపించాడట. రాజా డీలక్స్’ టైటిల్ తో ఆయన వినిపించిన కథ డీవీవీ దానయ్యకి బాగా నచ్చడంతో, ఇద్దరూ కలిసి ఈ లైన్ ను ప్రభాస్ చెవిన వేయడం జరిగిపోయిందట‌. అయితే ఈ ప్రాజెక్టు విషయంలో ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావలసి ఉంది. ఈ ప్రాజెక్టు ఓకే అయితే నిర్మాణ భాగస్వామిగా ఉండటానికి నిరంజన్ రెడ్డి కూడా ముందుకు వచ్చాడని అంటున్నారు. ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని టాక్ .. హారర్ కామెడీ సినిమా అని మరొక టాక్ వినిపిస్తున్నాయి. ఈ విషయంలో క్లారిటీ రావలసి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement