Wednesday, April 17, 2024

గుండెపోటుతో సూర్య దర్శకుడు మృతి

చాలా మంది తమిళ స్టార్ హీరోలు తెలుగు ప్రేక్షకులకు దగ్గరవటానికి కారణం వారు చేసే సినిమాలు.ముఖ్యంగా హీరో సూర్య తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడానికి కారణం వీడొక్కడే, బ్రదర్స్, బందోబస్త్ వంటి చిత్రాలు. అయితే ఆ సినిమాలకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ కె.వి.ఆనంద్. ఈయన ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించడం తో ఓటు ఫోటోగ్రాఫర్ గా కూడా పనిచేశారు.

అయితే కె.వి.ఆనంద్ ఈ రోజు తెల్లవారుజామున చెన్నైలో మృతి చెందారు. ఆయన హార్ట్ ఎటాక్ రావడంతో ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. కె.వి.ఆనంద్ మృతి పట్ల సినీ రాజకీయ ప్రముఖులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement