Monday, May 17, 2021

త్వరలోనే కొండపొలం పై క్లారిటీ ?

మెగా హీరో వైష్ణవ్ తేజ్ హీరోగా క్రేజీ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రకుల్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా కు సంబంధించి టైటిల్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇక ఈ సినిమాను కొండపొలం పుస్తకం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు.

అందుకే ఈ సినిమాకు కొండపొలం అనే టైటిల్ ను ఖరారు చేసినట్లుగా గతంలో వార్తలు వచ్చాయి.ఉప్పెన తర్వాత లాక్ డౌన్ సమయంలో కూడా దాదాపు 45 రోజులలో సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమా టాకీని పూర్తి చేశాడు క్రిష్. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ సినిమాను ఓటీటీ లో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే త్వరలోనే ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేసి థియేటర్స్ లో రిలీజ్ చేస్తారా.. లేదా అనే విషయంపై కూడా క్లారిటీ ఇవ్వనున్నారట క్రిష్. ప్రస్తుతం క్రిష్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Prabha News