Thursday, March 28, 2024

చెర్రీ శంకర్ సినిమా పై అప్డేట్ ఇచ్చిన దిల్ రాజు

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సంచలన దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు రామ్ చరణ్. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇక ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తుండగా… సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్నారు.

అయితే ఇందులో నటించే హీరోయిన్ ఎవరు అనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా ఈ సినిమా షూటింగ్ పై నిర్మాత దిల్ రాజు ఓ క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ లో సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని… పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ఒక స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడని సమాచారం. మరి చూడాలి ఈ సినిమాతో శంకర్ చరణ్ లు ఏ విధంగా మెప్పిస్తారో.

Advertisement

తాజా వార్తలు

Advertisement