Friday, April 26, 2024

దిగు దిగు దిగు నాగ @10 మిలియన్ వ్యూస్

హిట్ ఫ్లాప్ ల తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య. నాగశౌర్య ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. అందరూ లక్ష్య, వరుడు కావలెను వంటి సినిమాలు ఉన్నాయి. కాగా వరుడు కావలెను సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహిస్తున్నారు. రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే తమన్ సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి దిగు దిగు దిగు నాగ అనే లిరికల్ సాంగ్ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ భజన గేయం అయినప్పటికీ.. కొన్ని పదాలను జతచేసి యూత్ ని ఆకట్టుకునే విధంగా అనంతశ్రీరామ్ అద్భుతంగా రాశారు. కాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో పది మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement