Thursday, April 18, 2024

కార్తికేయ2 సినిమాకు డిఫ్రెంట్ టైటిల్ ?

చందు మొండేటి దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కార్తికేయ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. అలాగే ఈ సినిమాలో నిఖిల్ సరసన కలర్స్ స్వాతి హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ గా ప్రస్తుతం కార్తికేయ 2 తెరకెక్కుతోంది. ఈ సినిమా లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి టైటిల్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు.

అయితే తాజాగా కార్తికేయ 2 టైటిల్ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది. ‘దైవం మనుష్య రూపేనా’ అనే టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేశారని త్వరలోనే అందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ ప్రాంతాలలో షూటింగ్ ను జరిపారు. ఇక ఆగస్టు నుంచి యూరప్ లో నెక్స్ట్ షెడ్యూల్ జరగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement