Thursday, April 25, 2024

పుష్పలో ట్విస్ట్ పైనే సుకుమార్ ఫోకస్ పడిందా ?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ కనిపించబోతున్నాడు. అయితే పుష్ప సినిమాలో ఓ బిగ్గెస్ట్ ట్విస్ట్ ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్.

ఇదే వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుండగా… మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించబోతున్నారు. అలాగే ప్రముఖ కమెడియన్ సునీల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో చేస్తున్నారు. ఇక దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement