Saturday, April 20, 2024

వకీల్ సాబ్ విషయంలో దిల్ రాజుకు ప్రైమ్ నుంచి వచ్చిన ఎక్స్ ట్రా సొమ్ము ఎంతో తెలుసా ?

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం వకీల్ సాబ్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఘనవిజయం సాధించడంతో పాటు మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇదిలా ఉండగా ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో ఏప్రిల్ 30 న రిలీజ్ కాబోతుంది. మొదట ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేసిన 56 రోజుల తర్వాత ప్రైమ్ లో రిలీజ్ చేయాలని అనుకున్నారు. అందుకు 14 కోట్ల రూపాయల డీల్ కుదుర్చుకున్నారు.

ఇక ఇప్పుడు కరోనా వ్యాధి కారణంగా థియేటర్లన్నీ మూతపడ్డాయి. దీంతో మళ్లీ ఓటీటీ లకు డిమాండ్ పెరిగింది. కాగా నిర్మాత దిల్ రాజు అనుకున్న సమయానికంటే ముందుగానే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఇప్పుడు మరో 12 కోట్ల రూపాయలను అదనంగా ప్రైమ్ సంస్థను అడిగినట్లు తెలుస్తోంది. అందుకు అమెజాన్ ప్రైమ్ కూడా ఓకే చెప్పిందట.

Advertisement

తాజా వార్తలు

Advertisement