Friday, March 29, 2024

చరణ్ కథనే వరుణ్ కి మార్చేశాడా ?

ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఓ హీరోని అనుకోని కథలు రాసుకుంటూ ఉంటారు. అయితే కొన్నిసార్లు ఆ కథను ఆ హీరో కచ్చితంగా చేస్తాడనేది మాత్రం చెప్పలేము. కాగా తాజాగా చరణ్ కోసం సిద్ధం చేసిన ఓ కథ వరుణ్ వద్దకు వెళ్ళింది. ఛలో, భీష్మ సినిమాలతో వరుస హిట్లు అందుకున్న వెంకీ కుడుముల రామ్ చరణ్ తో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడట. కథ కూడా చెప్పాడట. కానీ చరణ్ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తున్న నేపథ్యంలో వెంకీకి నో చెప్పాడట.

వెంకీ ఆ కథను వరుణ్ తేజ్ కి వినిపించాడట. వరుణ్ తేజ్ కు కూడా ఆ కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. అయితే వెంకీ ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ ను సిద్దం చేసే పనిలో ఉన్నారట. ఇక అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాలు పూర్తవగానే వెంకీ కుడుములతో సినిమా చేసే అవకాశం ఉందట. వరుణ్ ఎఫ్ 3 సినిమాతో పాటు గని సినిమా చేస్తున్నాడు. గని లో బాక్సర్ గా వరుణ్ తేజ్ కనిపించబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement