Thursday, April 25, 2024

అనుష్క నవీన్ పొలిశెట్టి సినిమా ఆగిపోయిందా ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి ఒకానొక సమయంలో వరుస సినిమాలను చేస్తూ బిజీబిజీగా గడిపేది. అయితే ఇటీవల కాలంలో ఆ స్పీడును తగ్గించేసింది. ఇక ఆఖరిగా నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అనుష్క. ఆ తర్వాత మరో సినిమా అంటూ ఏమి రాలేదు. అదే ఇటీవల యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పొలిశెట్టి తో అనుష్క ఓ సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. రారా కృష్ణయ్య ఫేమ్ పి మహేష్ ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడని టాక్ నడిచింది.

అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆగిపోయిందట. అందుకు కారణం అనుష్క అని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అనుష్క బరువు తగ్గడానికి ప్రయత్నించినప్పటికీ ఏమాత్రం బరువు తగ్గేలేక పోయిందట. దీంతో సినిమాలకు పుల్ స్టాప్ పెట్టి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉందట ఈ అమ్మడు. అయితే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ… సోషల్ మీడియాలో మాత్రం వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement