Thursday, April 25, 2024

విక్ర‌మ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ధ్రువ న‌క్ష‌త్రం న్యూ పోస్ట‌ర్

త‌మిళ స్టార్ హీరో విక్ర‌మ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అందించారు ధ్రువ న‌క్ష‌త్రం మేక‌ర్స్. ఈ మూవీలో రీతూవర్మ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని గౌత‌మ్ వాసుదేవ్ మీన‌న్ రూపొందించారు. ధ్రువ నక్షత్రం కొత్త పోస్టర్‌ నెట్టింట హల్‌ చల్ చేస్తోంది. ఈ చిత్రంలో హీరో విక్రమ్ న‌టిస్తున్నారు. కాగా విక్ర‌మ్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ అందించారు మేకర్స్‌. ఈ చిత్రం జులై 14న థియేటర్లలో సందడి చేయనుంది. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు పూర్తవగా.. మేకర్స్ త్వరలోనే కొత్త ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ధ్రువ నక్షత్రంలో ఐశ్వర్యారాజేశ్‌, సిమ్రాన్‌, రాధికాతోపాటు ఇతర నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఒండ్రగ ఎంటర్‌టైన్‌మెంట్‌, కొండదువోం ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎస్కేప్‌ ఆర్టిస్ట్స్‌ మోషన్స్ పిక్చర్స్‌ బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ధ్రువ నక్షత్రం చిత్రానికి యువ సంగీత దర్శకుడు హరీష్‌ జైరాజ్‌ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement