Thursday, April 25, 2024

ట్విట్టర్ లో ధనుష్ సరికొత్త రికార్డ్

తమిళ స్టార్ హీరో ధనుష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ధనుష్ కు ఒక్క తమిళ్ లోనే కాకుండా ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. అయితే తాజాగా ధనుష్ ఓ సరికొత్త రికార్డును సృష్టించాడు. ట్విట్టర్ లో 10 మిలియన్ ల ఫాలోవర్స్ ను సంపాదించాడు. కోలీవుడ్ లో మిగతా స్టార్స్ ఎవరికి దక్కని ఘనత ధనుష్ కి దక్కింది.

ఈ నేపథ్యంలోనే ధనుష్ కి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ధనుష్ డి43 సినిమా చేస్తున్నాడు. ఇందులో మాళవిక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్నారు. దీని తరువాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు ధనుష్.

Advertisement

తాజా వార్తలు

Advertisement