Tuesday, March 26, 2024

150 కోట్ల రూపాయలతో ధనుష్ కొత్త ఇల్లు ?

తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రస్తుతం తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ భాషలలో వరుస సినిమాలు చేస్తున్నాడు. అయితే ధనుష్ ఇటీవల ఫిబ్రవరిలో తన సొంత ఇంటికి భూమిపూజ కూడా చేశాడు. దాదాపు 19 వేల చదరపు అడుగుల స్థలంలో నాలుగు అంతస్తుల భవనం ను ధనుష్ కట్టించబోతున్నారు.

అయితే ఇదే విషయమై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు పుట్టుకొస్తున్నాయి. ఆ భవన నిర్మాణానికి సుమారు 150 కోట్ల రూపాయల వరకు ఖర్చు ధనుష్ చేయబోతున్నారని టాక్ నడుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో వారికే తెలియాలి. ఇక సినిమాల విషయానికొస్తే ధనుష్ ఇటీవల రెమ్యూనరేషన్ కూడా అమాంతం పెంచేశాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాకు 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement