Friday, April 19, 2024

కర్ణన్ లో ధనుశ్ డదడలాడించేశాడట

సెల్వరాజ్ దర్శకత్వంలో ధనుస్ హీరో గా కర్ణన్ తెరకెక్కిన మూవీ కర్ణన్. ఈ  సినిమా, నిన్ననే తమిళనాట భారీ స్థాయిలో విడుదలైంది. ధనుశ్ నటనకి జనం వీలైనన్ని విజిల్స్ కొడుతున్నారట. మూవీ లో ధనుష్ నటనకి క్రిటిక్స్ నుంచి కూడా ప్రశంసలు వస్తున్నాయట.తన గ్రామ ప్రజల హక్కులను కాపాడటం కోసం పోరాడే యువకుడిగా ఈ సినిమాలో ధనుశ్ కనిపిస్తాడట. కథ అంతా కూడానా ఆయన పాత్ర చుట్టూనే తిరుగుతుందట. అనూహ్యమైన మలుపులు .. ఉద్వేగభరితమైన సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని అంటున్నారు. ధనుశ్ కెరియర్లో ఇది ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలిచిపోతుందనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. అక్కడి పత్రికలు ఈ సినిమాను ఆల్ టైమ్ క్లాసిక్ గా పేర్కొనడం విశేషం. త్వరలోనే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పలకరించే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement