Saturday, April 20, 2024

ధనుష్ 43 @మారన్ ఫస్ట్ లుక్

తమిళ స్టార్ హీరో ధనుష్ 38 వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తన కొత్త చిత్రం డి43 సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కార్తీక్ నరేన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు మారన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అయితే మారన్ అనే పేరు తమిళ పాండ్య రాజుల కాలంలోని పేరు. ఇదిలా ఉండగా… కొత్తగా రిలీజ్ చేసిన పోస్టర్ లో తన చేతిలో పెన్ను పట్టుకుని మనిషిని కొడుతూ కనిపిస్తున్నాడు ధనుష్.

అలాగే అద్దాలు ముక్కలుగా విరిగి పడి ఉన్నాయి. ఇక ఈ సినిమాలో ధనుష్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం. ముఖ్యంగా ధనుష్ సరసన మాళవికా మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే జి.వి.ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement