Thursday, April 25, 2024

దేవిశ్రీ బర్త్ డే స్పెషల్…పుష్ప అప్డేట్

గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పుష్ప రాజ్ గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ సినిమాకు సంబంధించి ఇప్పటకే విడుదలైన లుక్స్ , టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

ఇదిలా ఉండగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ కోసం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే దేవిశ్రీ పుట్టినరోజు సందర్భంగా యూనిట్ మాస్ సాంగ్ బీట్ ను రిలీజ్ చేసింది. సూపర్ బీట్స్ తో రాబోయే ఈ ఫుల్ సాంగ్ ను ఈ నెల 13వ తేదీన రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించింది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ గా నటిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement