Thursday, April 25, 2024

శివ ఇన్ ద స్కై అంటున్న దేవి శ్రీ ప్రసాద్

దేవి శ్రీ ప్రసాద్ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. తన మ్యూజిక్ తో కోట్లాదిమంది అభిమానుల ప్రేమాభిమానాలు పొందాడు దేవిశ్రీప్రసాద్. అయితే దేవిశ్రీప్రసాద్ కు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అంతే కాకుండా తాను తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాడు. అలాగే దేవిశ్రీ ప్రసాద్ కి దైవభక్తి కూడా చాలా ఎక్కువ.

కాగా ఆదివారం దేవి శ్రీ ప్రసాద్ ఆకాశంలో శివ రూపాన్ని చూపిస్తూ కెమెరాతో ఓ ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అంతేకాకుండా శివ ఇన్ ద స్కై అంటూ ఈ పాండమిక్ సిచువేషన్ నుంచి ప్రపంచాన్ని కాపాడటానికి వస్తున్నాడు అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం దేవి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement