Thursday, September 19, 2024

Devara | ర‌క్తంతో సంద్రం ఎరుపెక్కిన క‌థ‌.. దేవ‌ర ట్రైల‌ర్ రిలీజ్ !

కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ దేవ‌ర‌. సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో స్పీడ్‌ పెంచిన మేక‌ర్స్.. తాజాగా మూవీ ట్రైల‌ర్‌ని విడుద‌ల చేశారు. ఇక ట్రైల‌ర్ లో యాక్ష‌న్ సీక్వెన్స్‌, ఎన్టీఆర్ డైలాగులు అద‌ర‌హో అనిపించేలా ఉన్నాయి. మొత్తంగా ట్రైల‌ర్ సినిమా పై అంచ‌నాల‌ను పెంచేసింది.

YouTube video

ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీక‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తొండ‌గా.. సైఫ్ అలీఖాన్ ఇందులో విలన్‌‌‌‌‌‌‌‌గా న‌టిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్‌ టామ్‌ చాకో, నరైన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement