Tuesday, October 26, 2021

సాయి తేజ్‌ని కలిశాను: దేవ క‌ట్టా..

సెప్టెంబ‌ర్ 10న రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ్డ సాయి ధ‌ర‌మ్ తేజ్ ప్ర‌స్తుతం అపోలో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయ‌న ఆరోగ్యంపై అభిమానుల‌లో ఆందోళ‌న నెల‌కొంది. రిప‌బ్లిక్ డే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సాయి తేజ్ ఇంకా కోలుకోలేదు, కోమాలో ఉన్నాడ‌ని అందుకే ఈ ఈవెంట్‌కి తాను రావ‌ల్సి వ‌చ్చింద‌ని ప‌వ‌న్ పేర్కొన్నాడు. ప‌వ‌న్ వ్యాఖ్య‌ల తర్వాత అభిమానులు ఆయ‌న ఆరోగ్యం విష‌యంలో మ‌రింత ఆందోళన చెందారు.అయితే తాజాగా రిప‌బ్లిక్ సినిమా ప్ర‌మోష‌న్‌లోభాగంగా మాట్లాడిన దేవ క‌ట్టా.. యాక్సిడెంట్ త‌ర్వాత సాయి తేజ్‌ని కలిశాను. అక్టోబ‌ర్ 1న సినిమాను విడుద‌ల చేద్దామ‌ని ఆయనతో మాట్లాడిన త‌ర్వాతే ఫైన‌ల్‌గా ఓకే చేశామని తెలిపారు. రీసెంట్‌గా జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌ కూడా సాయి తేజ్ తర్వాత చూశాడని తెలిపారు.

ఇది కూడా చదవండి: పోసానిపై మెగా కుమార్తె నిహారిక ఫైర్

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News