Saturday, June 10, 2023

ఎన్టీఆర్‌తో రొమాన్స్ చేయ‌నున్న‌ దీపికా పదుకొణె.. త్వ‌ర‌లోనే ప్ర‌శాంత్ నీల్‌తో మూవీ

జూనియర్ ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సక్సెస్‌ను ఎంజాయ్‌ చేస్తున్నాడు. ‘అరవిందస త‌ర్వాత తారక్‌ దాదాపు నాలుగేళ్ల అనంత‌రం ట్రిపుల్‌ ఆర్‌తో అభిమానులను పలకరించాడు. ప్రస్తుతం ఈ చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర భారీ కలెక్షన్లను సాధిస్తోంది. రీసెంట్గానే ఈ చిత్రం వెయ్యి కోట్ల క్ల‌బ్‌లో అడుగుపెట్టింది. ఈ చిత్రంతో తారక్‌ పాన్‌ ఇండియా స్టార్‌ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం హాలీడే ఎంజాయ్‌ చేస్తున్న తారక్‌.. తరలోనే కొరటాల శివతో తన నెక్ట్స్‌ సినిమాను మొదలు పెట్టనున్నాడు. ఇక ఆ తరాత ప్రశాంత్‌ నీల్‌తో ఓ సినిమా చేయబోతున్న‌ట్టు తెలుస్తోంది. అయితే తాజాగా ప్రశాంత్‌ నీల్‌ సినిమాకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్‌ దీపిక పదుకొణే ఎంపిక అయినట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. ఇప్పటికే ప్రశాంత్‌ నీల్‌, దీపికను కలిసి కథను వినిపించాడట. కథ నచ్చడంతో దీపిక కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టులో దీపిక పాలుపంచుకోవడంతో సినిమాకు మరింత క్రేజ్‌ వస్తుందని ప్రశాంత్‌ నీల్‌ భావిస్తున్నాడట. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మేకర్స్‌ నుంచి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -
   

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement