Thursday, April 25, 2024

అలియాభట్ తో డేవిడ్ వార్నర్ డాన్స్

క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. సోషల్ మీడియాలో టిక్ టాక్ లు చేస్తూ అదిరిపోయే స్టెప్పులు వేస్తూ అందరినీ గతంలో అలరించాడు. అయితే ఇప్పుడు ఫేస్ మార్ఫింగ్ వీడియోలతో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ హీరోల పాటలకు డాన్సులు చేస్తున్నాడు. తాజాగా టైగర్ ష్రాఫ్ నటించిన స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాలోని ఓ పాటకు స్టెప్పులు వేశాడు.

ఫేస్ మార్ఫింగ్ ద్వారా చేసిన ఈ వీడియోను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు వార్నర్. అయితే ఇది నా అభిమానులు డిమాండ్ మేరకే అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ప్రస్తుతంఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది. మీరు కూడా ఓ లుక్కేయండి.

https://www.instagram.com/p/CPscdBgFY-C/?utm_medium=copy_link
Advertisement

తాజా వార్తలు

Advertisement