Friday, March 29, 2024

నిర్మాతగా కోడి రామకృష్ణ కూతురు

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ దివంగత కోడి రామకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చి ఘన విజయం సాధించారు కోడి రామకృష్ణ. అయితే కోడి రామకృష్ణ కూతురు దివ్య ఇప్పుడు సినీరంగంలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నిర్మాతగా మారబోతున్నారు.

ఈ మేర కోడి దివ్య ఎంటర్టైన్మెంట్ ను దివ్య ప్రారంభించింది. తొలి ప్రొడక్షన్ ను జూలై 15న అధికారికంగా ప్రకటన చేయబోతోంది. ఇక ఈ తొలి చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ శంకర్ తో నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement