Thursday, April 25, 2024

పొన్నియిన్ సెల్వ‌న్‌ 2 ఆడియో, ట్రైల‌ర్ లాంచ్ ఈవేంట్ కి డేట్ అండ్ వెన్యూ ఫిక్స్!

డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం ఆవిష్క‌రిస్తోన్న విజువ‌ల్ వండ‌ర్ మూవీ పొన్నియిన్ 2. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, మ‌ద్రాస్ టాకీస్ బ్యాన‌ర్స్‌ పై సుభాస్క‌ర‌న్‌, మ‌ణిర‌త్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గ‌త ఏడాది సెన్సేష‌న‌ల్ హిట్ అయిన హిస్టారిక‌ల్ మూవీ పొన్నియిన్ సెల్వ‌న్ 1కి కొన‌సాగింపుగా పొన్నియిన్ సెల్వ‌న్ 2 తెర‌కెక్కుతోంది. రెండో భాగంపై హై ఎక్స్‌పెక్టేష‌న్స్ నెల‌కొన్నాయి. ఏప్రిల్ 28న వ‌ర‌ల్డ్ వైడ్‌గా తెలుగు, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో పొన్నియిన్ సెల్వ‌న్ 2 విడుద‌ల‌వుతుంది.

ఇప్ప‌టికే విడుద‌లైన బి.టి.ఎస్ వీడియో, ఆగ‌నందే పాట‌కు సూప‌ర్బ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ మూవీ ట్రైల‌ర్‌, ఆడియో లాంచ్‌ను చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో మార్చి 29న ఘ‌నంగా జ‌రగ‌నుంది. చిత్ర యూనిట్ స‌హా ప‌లువురు స్టార్స్ ఈ వేడుక‌కి హాజ‌రు కాబోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement