Thursday, April 18, 2024

ప్ర‌తి యాక్ష‌న్ సీన్ ను మెచ్చుకుంటారు…

నాగ చైతన్య నటించిన తాజా చిత్రం కస్టడీ ప్రేక్షకుల ముందుకువచ్చింది. వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా తెరకెక్కింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన కస్టడీ థియేటర్లలో ప్రదర్శింపబుడుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్‌ మీట్‌లో హీరో నాగచైతన్య మాట్లాడుతూ, ”కస్టడీ సినిమాను ఆదరిసు ్తన్న తెలుగు సినిమా ప్రేక్షకులకు ప్రత్యేక కృతజ్ఞతలు. మొదటి షో నుంచి పాజిటివ్‌ టాక్‌ వచ్చింది. మేము నమ్మి చేసిన అండర్‌వాటర్‌ సీన్‌, పోలీస్‌ స్టేషన్‌ లో సింగిల్‌ షాట్‌ ఫైట్‌, -టె-న్‌ ఫైట్‌, ఫ్లాష్‌ బ్యాక్‌ లో వచ్చే ఓ సీన్‌ కు మంచి స్పందన వచ్చిం ది. రొటీ-న్‌ గా కాకుండా కొత్తగా చేయాలని ప్రయత్నం చేశా ను. ఆదరిస్తున్న ఆడియన్స్‌ కు అభినందనలు తెలుపుతున్నా. మమ్మల్ని నమ్మి చేసిన నిర్మాత, దర్శకుల కు ధన్యవాదాలు తెలియజేసుకుంటు-న్నాను” అని అన్నారు.

హీరోయిన్‌ కృతిశెట్టి మాట్లాడుతూ ”దర్శకుడు వెంకట్‌ ప్రభు గారు నన్ను నమ్మి మంచి పాత్ర ఇచ్చారు. నాగచైతన్య తో నటించడం చా లా ఆనందంగా వుంది. అలాగే వెన్నెల కిశో ర్‌, సంపత్‌ గారితో నటించడం ఆహ్లాదంగా ఉంది. కస్టడీ సినిమా హిట్‌ అయిందంటే అందుకు ప్రేక్షకులకుప్రత్యేక ధన్యవాదాలు అన్నా రు. ఆర్ట్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ మాట్లా డుతూ, ”ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశాలు చాలా వున్నాయి. పోలీస్‌ స్టేషన్‌ ఫైట్‌ గానీ, అండర్‌ వాటర్‌ సీన్‌ గానీ ఖర్చుపెట్టి నిర్మాత తీయించారు. అవి చాలా అద్భుతంగా దర్శకుడు తీశారు. థియేటర్‌ లో వాటికి మంచి స్పందన వస్తోంది” అన్నారు.
చిత్ర దర్శకుడు వెంకట్‌ ప్రభు మాట్లాడుతూ,” తెలుగు లో నేను చేసిన మొదటి సినిమాకి వస్తున్న గొప్ప ఆదరణకు థ్యాంక్స్‌ చెబుతున్నా. వందశాతం మా కష్టం ఫలించింది . యాక్షన్‌ ఫిలిం ఇది. నాలుగు నిముషాల సింగిల్‌ షాట్‌ ఫైట్‌ ను మహేష్‌ కొరియోగ్రఫీ చేశారు. ఈ రిస్కీ షాట్‌ను అవస రమైతే మరోసారి చేస్తాను అనికూడా నాగచైతన్య అన్నారు. ఆయన డెడికేషన్‌ నచ్చింది. కస్టడీ సినిమా ను తెలుగు, తమిళంలో కూడా బాగా ఆదరిస్తున్నారు.” అని చెప్పారు.
నిర్మాత శ్రీనివాస్‌ చిట్టూరి మాట్లాడుతూ, ”కస్టడీ బ్లాక్‌ బస్టర్‌ అయినందుకు ఆనందంగా వుంది. కథలో ఏది నమ్మామో అది వర్కవుట్‌ అయింది. ” అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement