Monday, March 25, 2024

సోషల్ మీడియాలో ‘అఖండ’ రికార్డ్స్

బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం అఖండ.భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత ఎక్కువయ్యాయి. ఇదిలా ఉండగా ఉగాది సందర్భంగా అఖండ చిత్రానికి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 13 న విడుదలైన ఈ టీజర్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.

బాలయ్య చెప్పిన డైలాగులు తమన్ అందించిన మ్యూజిక్ హైలెట్ గా నిలిచాయి. అయితే ఈ టీజర్ 28 మిలియన్ల వ్యూస్ ను సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. అంతే కాదు 370కె లైక్స్ తో ముందుకు దూసుకెళ్తోంది. ఇక ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్నారు. మే 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement