Saturday, April 20, 2024

ఎన్టీఆర్ 30పై క్రేజీ బజ్.. అప్డేట్స్ కోసం అభిమానుల ఎదురుచూపులు

ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వర్కింగ్ టైటిల్ గా #NTR30 అని ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. కాగా, RRR లాంటి భారీ పాన్ ఇండియా మూవీతో వరల్డ్ వైడ్ గా పాపులారిటీ తెచ్చుకున్న తారక్ నెక్స్ట్ కొరటాల శివతో సినిమాకి గాను జస్ట్ తన టైటిల్ ఎనౌన్స్ మెంట్ తోనే పాన్ ఇండియా లెవెల్లో ఎనలేని హైప్ క్రియేట్ చేశాడు. దీంతో ఇంతటి భారీ అంచనాలున్న ఈ మూవీ రెగ్యులర్​ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలు అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అయితే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నం అయ్యి ఉన్న ఈ మూవీ టీం భారీ సెట్ వర్క్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం ఈ సినిమా పై ఇప్పుడు మరో బజ్ అయితే వైరల్ అవుతోంది. ఈ సినిమా షూట్ బహుశా ఈ మార్చి మధ్య నుంచి స్టార్ట్ అయ్యే చాన్స్ ఉందటున్నాయి సినీ వర్గాలు. ఈ మూవీ అప్ డేట్స్ కోసం ఎన్ టీఆర్ ఫ్యాన్స్ తెగ ఆకలితో ఎదురుచూస్తున్నారు. మరి ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement