Tuesday, April 13, 2021

వకీల్ సాబ్ మరో హీరోయిన్ కు కరోనా

ప్రముఖ నటి అంజలి కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కాగా ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇటీవల హీరోయిన్ నివేద థామస్ కూడా ఈ మహమ్మారి బారిన పడ్డారు. అయితే నివేదాకు పాజిటివ్ నిర్ధారణ అయిన నాలుగు రోజుల్లోనే అంజలికి కూడా పాజిటివ్ నిర్ధారణ అయింది.

ఇక ఇటీవల నివేదాథామస్ తో పాటు అంజలి కూడా ప్రమోషన్స్ పాల్గొనడంతో వకీల్ సాబ్ టీమ్ అంతా కూడా భయాందోళన చెందుతున్నారు. కాగా అంజలి ప్రస్తుత ఐసొలేషన్ లో చికిత్స పొందుతోంది. ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు టెస్ట్ లు చేసుకోవాలని కోరారు అంజలి. స్వల్ప అస్వస్థతకు గురికావటంతో డౌట్ వచ్చి టెస్ట్ లు చేసుకోగా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక ఆమె నటించిన వకీల్ సాబ్ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Prabha News