Friday, April 19, 2024

ఆండ్రియాకు కరోనా పాజిటివ్

కరోనా సెకండ్ వేవ్ తీవ్రత రోజు రోజుకీ ఎక్కువవుతోంది. సామాన్య ప్రజలతో పాటు సిని రాజకీయ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. అంతేకాకుండా పలువురు ఈ మహమ్మారి కారణంగా చనిపోతున్నారు కూడా. తాజాగా ప్రముఖ తమిళ నటి ఆండ్రియా జెరేమియా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె హోమ్ క్వారంటైన్ ఉన్నారట.

ఇక ఆండ్రియా ఇటీవల విజయ్ దళపతి హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన మాస్టర్ సినిమాలో నటించారు. అలాగే గతంలో కార్తీ హీరోగా వచ్చిన యుగానికి ఒక్కడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు ఆండ్రియా. ఇదిలా ఉండగా ఆండ్రియా త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement