Sunday, May 16, 2021

దీపికా పదుకొనే కు కరోనా

కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో సామాన్య ప్రజలతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు సినీ స్టార్స్ ఈ మహమ్మారి బారిన పడగా తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే కరోనా మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా… కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం దీపిక సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. కరోనా నుండి కోలుకోవడానికి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ వాడుతున్నారు.

తేలికపాటి లక్షణాల తో ప్రస్తుతానికి దీపిక బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీపిక తల్లిదండ్రులు సోదరి కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు. దీపికా పదుకొనే తండ్రి ప్రకాష్ బెంగళూరు లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. తల్లి, సోదరి ఇంట్లోనే ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News