Sunday, April 11, 2021

బాలీవుడ్ లో మరో ఇద్దరు స్టార్స్ కి కరోనా- ఇబ్బందుల్లో మేకర్స్ ?

దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ లో అలియా భట్, రన్బీర్ కపూర్, మలైకాకి ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక ఆదివారం బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ ఖాన్ కు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇక తాజాగా మరో ఇద్దరు బాలీవుడ్ స్టార్లకు ఈ మహమ్మారి సోకింది.

విక్కీ కౌశల్, భూమి పెడ్నేకర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆ మేర వారిద్దరూ కూడా అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ఇద్దరితో షూటింగ్ లో సన్నిహితంగా ఉన్నవారంతా షూటింగ్ ను రద్దు చేసుకుంటున్నారు. మొత్తంగా బాలీవుడ్ లో వరుసగా నటీనటులు కరోనా బారిన పడుతుండటంతో షూటింగ్ లు వాయిదా పడుతున్నాయి. దీనితో చిత్ర దర్శక నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News