Wednesday, March 27, 2024

సూపర్… మహేష్ బాబు పాటకు కరోనా రోగుల డాన్స్

కరోనా సెకండ్ వేవ్ కారణంగా దేశం మరోసారి అతలాకుతలమవుతోంది. ప్రతిరోజు లక్షల కేసులు నమోదవుతున్నాయి. కేసుల పెరుగుదలను నియంత్రించటానికి రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే ఆంక్షలను విధిస్తున్నారు. మాస్కులు ధరించడం, సామాజిక దూరాన్ని పాటించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు. అంతేకాకుండా వీలైనంత త్వరగా టీకాలు వేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే కరోనా రోగులకు వీటన్నింటితో పాటు మనోధైర్యంగా ఉల్లాసంగా ఉండటం చాలా అవసరం. అవును అది ఎంతటి అవసరమో కింద ఉన్న వీడియో చూస్తే అర్థమవుతుంది.

ఈ వీడియో ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు కు సంబంధించిన వీడియో. ఈ వీడియోలో కొంతమంది కరోనా రోగులు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన శ్రీమంతుడు సినిమాలోని రామ రామ పాట ఎంజాయ్ చేస్తూ డాన్స్ చేయడం చూడవచ్చు. రెండు నిమిషాలు 20 సెకన్ల పాటు సాగిన ఈ వీడియోలో కరోనా రోగులు ఎంతో ఉల్లాసంగా ఉండటం గమనించొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement