Wednesday, April 24, 2024

టాలీవుడ్‌కు కరోనా నిబంధనలు

టాలీవుడ్ లో మళ్లీ విడ్ నిబంధనలు పాటిస్తూ షూటింగ్ లు చేయాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని పలువురు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉండటం దీనికి కారణం. దేశవ్యాప్తంగా రోజుకు లక్షకు పైగా, తెలుగు రాష్ట్రాల్లో మూడు వేల వరకు పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. మరో నాలుగు వారాలు కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని వైద్య ఆరోగ్య శాఖలు హెచ్చరిస్తున్నాయి. కరోనా ప్రభావం ఇప్పటికే సినీరంగంపై కనిపిస్తోంది. వందలాది మంది కరోనాతో బాధపడుతూ, హాస్పిటల్లో, ఇంట్లో ఐసోలేషన్లో ఉంటున్నారు. చాలామంది తమకు కరోనా సోకిన విషయాన్ని బహిరంగంగా వెల్లడించడం లేదు. ఇక కరోనా కారణంగా పాఠశాలలు మూసివేసిన తర్వాత ఈ ప్రభావం సినిమా థియేటర్లపై, ఇంకా షూటింగ్ లపై ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు సంశయిస్తున్నాయి. మహారాష్ట్రలో వీకెండ్ కర్యూ విధించారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న కారణంగా లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని అంటున్నారు. టాలీవుడ్ విషయానికి వస్తే లాక్ డౌన్ వల్ల దాదాపు పదినెలలు సినీరంగం మూతపడింది.

ఆ తర్వాత నిబంధనలకు లోబడి షూటింగ్లు జరిగాయి. క్రమంగా కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో షూటింగ్లు విరివిరిగా పెరిగాయి. ఒక్కో రోజు వందసినిమాల వరకు షూటింగ్ లు జరిగాయంటే సినీరంగం మళ్లీ కళకళ లాడింది. అలాగే థియేటర్లు తెరిచాక అంటే డిసెంబర్నె లాఖరు నుండి విడుదలైన కొత్త సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తూ వస్తున్నారు. వీటిలో సూపర్ హిట్ సినిమాలు సైతం ఉన్నాయి. థియేటర్లు ప్రేక్షకులతో నిండుతూ ఉత్సాహం కలిగిస్తున్నాయి. ఈ పరిణామం గమనించిన సినీ ప్రముఖులు వరుసగా సినిమాలు విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ఇటీవలే పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మే నుండి చిరంజీవి సహా అనేక మంది అగ్రహీరోల సినిమాల విడుదల తేదీలను ప్రకటించి ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మాత్రం ఆందోళన తప్పడం లేదని పంపిణీదారులు, నిర్మాతలు వాపోతున్నారు. కరోనా కారణం చూపుతూ థియేటర్ల ఆక్యూపెన్సి మళ్లీ యాభై శాతానికి పరిమింతే చేస్తే నిర్మాతలు నష్టపోతారు. లేదా లాక్ డౌన్ అంటూ మొత్తానికి థియేటర్లు మూసినీ చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతుందని పలువురు నిర్మాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

యూనిట్ సభ్యుల క్షేమం దృష్ట్యా షూటింగ్ లొకేషన్స్ లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కార్మికులు భావిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ షూటింగ్స్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కరోన నియమావళి అమలుచేస్తున్నారు. వాటిలో ముఖ్యమైనవి. తక్కువ మంది ఆర్టిస్టులతో షూటింగ్ లు చేయడం. గ్రూప్ సాంగ్స్ చిత్రీకరణ కొంతకాలం వాయిదా వేయడం. లొకేషన్ లో తరచుగా శానిటైజేషన్ చేయడం వంటివి ఉన్నాయి. వీటితో పాటుగా మేకప్ చేసే వ్యక్తులు పీపీఈ కిట్ ధరించేలా టాలీవుడ్ లో నిబంధన అమలు చేయాలనే డిమాండ్ కార్మికుల నుండి వస్తోంది. కరోనా కారణంగా షూటింగ్ లు నిలిచిపోతే వేలాది కార్మికుల తీవ్రంగా నష్టపోతారు. గత అనుభవం నేపథ్యంలో తగిన జాగ్రత్తలతో షూటింగ్ లు చేసుకోమని కోరుతారు కానీ, నిలుపు చేసే అవకాశం లేదని సినీ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement