Saturday, April 20, 2024

కరోనా కష్టకాలంలో సూర్య మరో సహాయం

కరోనా మహమ్మారి కారణంగా ఎంతో మంది సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే తన ఫ్యాన్ క్లబ్ సభ్యులకు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. తన అభిమాన సంఘాలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలపై స్పందించే సూర్య తాజాగా లాక్ డౌన్ పరిస్థితుల వల్ల ఉపాధి కోల్పోయిన 250 మంది ఫ్యాన్ క్లబ్ సభ్యులకు ఒక్కొక్కరికి ఐదు వేల రూపాయలు విరాళంగా ఇచ్చారట.

సూర్య చేస్తున్న ఈ సహాయం పట్ల అలాగే అభిమానులపై చూపుతున్న ప్రేమాభిమానాలకు నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. గతంలో సూర్య తన సోదరుడితో కలిసి కోటి రూపాయలు తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళంగా ఇచ్చిన సంగతి కూడా తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement