Wednesday, April 24, 2024

టామ్ క్రూజ్ కి కరోనా పాజిటివ్..?

హాలీవుడ్ చిత్రం మిష‌న్ ఇంపాజిబుల్ 7 షూటింగ్ కి కరోనా ఎఫెక్ట్ పడింది. క్రిస్టోఫర్‌ మెక్‌ క్వారీ దర్శకత్వంలో టామ్ క్రూజ్ హీరోగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్‌లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టించిన‌ట్టు హాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొన్నాయి. నైట్​క్లబ్​లో షూటింగ్ జరగాల్సి ఉండగా.. ముగ్గురు డ్యాన్సర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అంద‌రికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, ప‌ద‌కొండు మంది క‌రోనా బారిన ప‌డిన‌ట్టు తెలుస్తుంది. ఇందులో టామ్ క్రూజ్ ఉన్నాడ‌ని టాక్. అయితే బ్రిటిష్​ టాబ్లాయిడ్స్​ మాత్రం కేవలం సిబ్బంది మాత్ర‌మే క‌రోనా బారిన ప‌డ్డార‌ని చిత్ర యూనిట్ అంతా ఐసోలేష‌న్‌లో ఉన్నార‌ని పేర్కొంది. కొందరు సిబ్బందికి పాజిటివ్​ తేలడంతో షూటింగ్​కు నిలిపివేసినట్లు పారామౌంట్ పిక్చర్స్​ గురువారం అధికారికంగా ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement