Thursday, March 28, 2024

బీస్ట్ టైటిల్ విషయంలో వివాదం !!

తమిళ స్టార్ హీరో విజయ్ గురించి సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. విజయ్ కు ఒక్క తమిళ్ లోనే కాకుండా ఇండియా మొత్తం అభిమానులు ఉన్నారు. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా తన 65 వ చిత్రానికి బీస్ట్ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ అనౌన్స్ చేశారు. అయితే ఈ చిత్రానికి బీస్ట్ అనే టైటిల్ పెట్టడం పట్ల కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంగ్లీష్ లో టైటిల్ పెడితే చిన్న హీరోలు కూడా అదే విధంగా ముందుకు వెళ్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కొంత మంది తమిళులు.

అయితే ఆ ఆగ్రహానికి కారణం లేకపోలేదు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తమిళ సినిమాలకు పరభాషతో టైటిల్ పెడితే రాయితీలలో కోత విధిస్తామని ప్రకటించింది. దీంతో తమిళ్ లోని టైటిల్ పెట్టడం మొదలుపెట్టారు. కాగా కొన్నేళ్లకు ఆ రూల్ ని ఎత్తేశారు. అయితే ఇప్పుడు బీస్ట్ టైటిల్ విషయంలో అసహనం వ్యక్తం చేస్తున్నారు తమిళ సోదరులు. మరి టైటిల్ విషయంలో యూనిట్ పునరాలోచన చేస్తారా లేదా అనేది చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement