Tuesday, October 15, 2024

OTT | ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న ‘క‌మిటీ కుర్రోళ్ళు’…

హారిక కొణిదెల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ సంయుక్త నిర్మాణంలో దర్శకుడు యాదు వంశీ తెరకెక్కిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’. ఆగస్ట్ 9న చిన్న సినిమాగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ విజయం సాధించి 17 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.

కాగా, తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. ఈటీవి విన్ సెప్టెంబర్ 12 నుంచి క‌మిటీ కుర్రోళ్ళు సినిమా స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement