Wednesday, March 27, 2024

కొండ‌గ‌ట్టు అంజ‌న్న‌కి.. వేణు ప్ర‌త్యేక పూజ‌లు

క‌మెడియ‌న్..డైరెక్ట‌ర్ వేణు కొండగట్టులో ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. బలగం చిత్రం విజయం సాధించిన కారణంగా వేణు అక్కడ కొండగట్టు అంజన్నకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆ దృశ్యాలని వేణు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కొండగట్టు అంజన్న ఆశీర్వాదంతో బలగం సినిమా మొదలు పెట్టాను..అంజన్న దయతో బలగం మీ అందరిని మెప్పించింది..అంజన్న దర్శనం అద్భుతంగా జరిగింది అని పోస్ట్ చేశారు. వేణు ఆంజనేయస్వామికి పూజలు నిర్వహిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మార్చి 3న రిలీజైన ఈ చిత్రం అద్భుతమైన మౌత్ టాక్ తో ప్రేక్షకులని అలరించింది. మెగాస్టార్ చిరంజీవి సైతం వేణుని, బలగం చిత్ర యూనిట్ ని అభినందించారు. బలగం చిత్రం అందించిన ఉత్సాహంతో తన రెండవ చిత్రాన్ని మరింత బాధ్యతగా రూపొందింస్తానని వేణు తెలిపారు. బలగం చిత్రం రీసెంట్ గా ఓటిటిలోకి కూడా విడుదలై దుమ్మురేపుతోంది. ప్రైమ్ వీడియోలో ఈ చిత్రాన్ని తీసుకువచ్చారు. ఇటీవల వేణు వేములవాడని కూడా సందర్శించారు. ఆంజనేయస్వామి దీక్ష చేసినట్లు సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement